బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

జనోదయ,కమాన్‌పూర్/8వ కాలనీ ఏప్రిల్ 14: భారతీయ జనతా పార్టీ 8వ కాలనీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బీఎంఎస్ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేసి, విద్య ద్వారా సమాజాన్ని మార్చాలని పిలుపునిచ్చిన గొప్ప నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. భారత...