janodaya.in
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 10:29 am Digital Edition : JANODAYA MEDIA

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

జనోదయ,కమాన్‌పూర్/8వ కాలనీ ఏప్రిల్ 14:

భారతీయ జనతా పార్టీ 8వ కాలనీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బీఎంఎస్ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేసి, విద్య ద్వారా సమాజాన్ని మార్చాలని పిలుపునిచ్చిన గొప్ప నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహనీయుడని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే సమానత్వ సమాజం సాధ్యమవుతుందని నాయకులు అన్నారు.

మండల అధ్యక్షుడు ఆకుల శశికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కార్యదర్శి మూకిరి రాజు, మండల ప్రధాన కార్యదర్శి ఆకుల కుమార్ గౌడ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు బద్రి దేవేందర్, లింగం నాయక్, గంధం శంకర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు ఐలవేని అనిల్ కుమార్, మహిళా నాయకురాలు మీనుగు మనోహర, ఆకుల అఖిల్ గౌడ్, మిరాల రాజు, దినేష్, డప్పు కుమార్, హిందూ వాహిని నాయకులు మండ సాయి ప్రణీత్, రామంచ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఘనంగా సాగింది.