గడ్డిమందు విషతుల్యానికి గోల్డెన్ అవర్ కీలకం : 4–5 గంటల్లో ఆసుపత్రికి తీసుకురండి
జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 14: పారాక్వాట్గా పిలువబడే గడ్డిమందు సేవించిన వారిని 4 నుంచి 5 గంటల్లోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రి నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్ తెలిపారు.పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో ఎండోసల్ఫాన్ వంటి పురుగుమందులు సేవించిన సందర్భాల్లో విరుగుడు అందుబాటులో ఉండటంతో బాధితులను ఎక్కువ శాతం కాపాడగలిగామని చెప్పారు.అయితే ఇటీవలి కాలంలో గడ్డిమందు సేవించే ఘటనలు పెరిగాయని,దానికి ప్రత్యక్ష విరుగుడు...