రాష్ట్ర సుభిక్షం కోసం కొండగట్టులో మంత్రుల గిరిప్రదక్షిణ

జనోదయ  కరీంనగర్ /కొండగట్టు, జూలై 29: గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో నిర్వహించిన గిరిప్రదక్షిణ భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, జలాశయాలు నిండిపోవడంతో పాటు రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం...