సీఎం కప్ బేస్‌బాల్ రాష్ట్రస్థాయికి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ఎంపిక

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 15: సుల్తానాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సీఎం కప్–2025 జిల్లా స్థాయి బేస్‌బాల్ పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు మెరుగైన ప్రతిభను చాటుకున్నారు. జె.సాత్విక,ఏ.లాస్యప్రియ,జి.వెన్నెల పోటీల్లో ఆకట్టుకునే ప్రదర్శనతో ఎంపికై ఈనెల 16 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పెద్దపల్లి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా స్థాయి పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ క్రీడాకారులు చూపిన సమన్వయం,సాంకేతిక నైపుణ్యం,ఆత్మవిశ్వాసం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.రాష్ట్రస్థాయిలో జిల్లా గౌరవాన్ని నిలబెట్టేలా ప్రదర్శన ఇవ్వాలని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ...