janodaya.in
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 5:30 pm Digital Edition : VAMSHI PADALA

సీఎం కప్ బేస్‌బాల్ రాష్ట్రస్థాయికి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ఎంపిక

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 15:

సుల్తానాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సీఎం కప్–2025 జిల్లా స్థాయి బేస్‌బాల్ పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు మెరుగైన ప్రతిభను చాటుకున్నారు. జె.సాత్విక,ఏ.లాస్యప్రియ,జి.వెన్నెల పోటీల్లో ఆకట్టుకునే ప్రదర్శనతో ఎంపికై ఈనెల 16 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పెద్దపల్లి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

జిల్లా స్థాయి పోటీల్లో గాయత్రి విద్యానికేతన్ క్రీడాకారులు చూపిన సమన్వయం,సాంకేతిక నైపుణ్యం,ఆత్మవిశ్వాసం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.రాష్ట్రస్థాయిలో జిల్లా గౌరవాన్ని నిలబెట్టేలా ప్రదర్శన ఇవ్వాలని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఖోఖో సంఘం బాధ్యులు పి.వెంకట ఉమాపతి,పెద్దపల్లి టగ్ ఆఫ్ వార్ జిల్లా సంఘం అధ్యక్షుడు ఆలేటి సంపత్,పెద్దపల్లి జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి వాసు,వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.వారి సమక్షంలో ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభను చాటాలని సూచించారు.పాఠశాల ప్రతినిధి రజనీ దేవి,ప్రిన్సిపాల్ విజయ్,వ్యాయామ ఉపాధ్యాయుడు అజయ్ కుమార్ విద్యార్థుల విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

జిల్లా స్థాయి విజయంతో రాష్ట్రస్థాయిలో అడుగుపెడుతున్న ఈ యువ క్రీడాకారులు పెద్దపల్లి జిల్లా క్రీడా ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది.