చెరువుల్లో చేపల వేటకు అడ్డంకులు – కలెక్టర్‌ను ఆశ్రయించిన మత్సకారులు
🔹సర్పంచ్ భర్త బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని వినతి జనోదయ,పెద్దపల్లి మార్చి 10: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన మత్సకారులు తమ జీవనాధారమైన చెరువుల్లో చేపలు పట్టుకునేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు,మత్సకారులు కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘం ప్రతినిధులు వివరించిన ప్రకారం,1986లో నమోదైన వడ్కాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ప్రస్తుతం సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు.వడ్కాపూర్,వెంకట్రావుపల్లి గ్రామాల చెరువులు సంఘ పరిధిలోకి...