సుల్తానాబాద్ హత్య కేసులో తుది తీర్పు – నిందితుడికి జీవిత ఖైదు
జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 17: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసుకు పెద్దపల్లి జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించింది. దొంగతనం లక్ష్యంగా తన పెద్దమ్మను హత్య చేసిన కొదాటి సంపత్ రావుకు జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం కఠిన నిర్ణయం ప్రకటించింది. 2019లో కోదురుపాక గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒంటరిగా నివసిస్తున్న తన పెద్దమ్మ చంద్రమ్మ ఇంట్లోకి రాత్రివేళ ప్రవేశించిన నిందితుడు,...