ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం – ఈసాల తక్కలపల్లిలో అవగాహన సదస్సు

🔹రైతులకు చెక్కుల పంపిణీ…పంట విస్తరణకు కలెక్టర్ పిలుపు జనోదయ,పెద్దపల్లి ఏప్రిల్ 8: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన సదస్సు,సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జిల్లాలో ఆయిల్ పామ్ సాగులో ముందంజలో ఉన్న ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు రైతులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల కోతకు వచ్చిన పామ్ పంటకు సంబంధించిన చెక్కులను రైతులకు పంపిణీ చేశారు.బామ్లా నాయక్ తండాకు చెందిన భూక్య బాలు నాయక్‌కు రూ.23,920,ఎలకలపల్లి గ్రామానికి...