janodaya.in
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 1:35 pm Digital Edition : JANODAYA MEDIA

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

 

జగిత్యాల జిల్లా :

జగిత్యాల జిల్లా // పెగడపల్లి మండల పరిధిలోని హనుమంతునిపల్లి పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధి, సామాజిక ఐక్యతే లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో  అధ్యక్షుడిగా గాజుల నర్సయ్య, గౌరవ అధ్యక్షుడిగా గాజుల మల్లయ్య, ఉపాధ్యక్షులుగా పెద్ది సుదాకర్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది రాజేశం, సంయుక్త కార్యదర్శిగా మరంపెల్లి మల్లేశం, కోశాధికారిగా సామల బుచ్చిరాములు ఎన్నికయ్యారు. అలాగే సంఘం అభివృద్ధికి కృషి చేసేలా ఇతర కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం అభివృద్ధికి, కుల బాంధవ్యాల బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తామని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను సంఘ కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.