janodaya.in
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 5:08 am Digital Edition : JANODAYA MEDIA

గొల్లపల్లె (వట్టిమల్ల) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఐడీ కార్డులు, బెల్ట్ & టై పంపిణీ

కోనరావుపేట: గొల్లపల్లె (వట్టిమల్ల) ప్రభుత్వ పాఠశాలలో VSDC కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టూడెంట్ ఐడీ కార్డులు, బెల్ట్, టై పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

బండ శ్రీకాంత్ (s/o రాములు) గారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాంత్ గారి తల్లిదండ్రులు విద్యార్థులకు స్వయంగా ఐడీ కార్డులు, బెల్ట్, టైలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు గ్రామ సర్పంచ్ మాడుగుల ఆమని శ్రీకాంత్, ఉపసర్పంచ్ బండ గణేష్, VSDC కమిటీ తరఫున మేడుదుల అనిల్, ముచ్చర్ల దేవరాజు పాల్గొన్నారు.

విద్యార్థుల అభివృద్ధి, పాఠశాల మౌలిక వసతుల మెరుగుదల కోసం కమిటీ చేపడుతున్న కార్యక్రమాలకు గ్రామస్థులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని VSDC కోఆర్డినేటర్ నూనె రాజేందర్ తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

— VSDC కమిటీ, గొల్లపల్లె (వట్టిమల్ల)