అడ్రియాల లాంగ్‌వాల్ గనిలో డైరెక్టర్ ఇ&ఎం పర్యటన
జనోదయ,రామగిరి ఫిబ్రవరి 10: మంగళవారం అడ్రియాల లాంగ్‌వాల్ గనిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.డైరెక్టర్ ఇఅండ్‌ఎం యం.తిరుమలరావు గనిని సందర్శించి ఉత్పత్తి మరియు భద్రతా అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. తదుపరి సమావేశంలో గనిలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు డైరెక్టర్‌కు వివరించారు.ముఖ్యంగా లాంగ్‌వాల్ మూడో ప్యానెల్ సాల్వేజింగ్ పనుల పురోగతి అలాగే నాలుగో ప్యానెల్ తయారీ పనులపై విస్తృతంగా చర్చ జరిగింది.ఈ...