*కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తోంది: మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మెచినేని నవీన్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకుడు మేడిపల్లి సత్యంపై మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మెచినేని నవీన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలేశ్వరం, ఎల్లంపల్లి నీటి అంశంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగానే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగిందని, అందుకే నీటి విడుదల జరుగుతోందని అన్నారు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని వక్రీకరించి కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. "కాంగ్రెస్ వాళ్ల అబద్ధాలకు,...