పెద్దపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం – ఓటు వేయకుండానే వెనుదిరిగిన ఓటరు
🔹ఏజెంట్ అభ్యంతరంపై వివాదం… వివరాల తేడా కారణమన్న అధికారులు 🔹చివరి నిమిషంలో అనుమతి వచ్చినా పోలింగ్ కేంద్రం విడిచిన ఓటరు జనోదయ,పెద్దపల్లి ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి మున్సిపాలిటీలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది.ఓటు వేయడానికి వచ్చిన ఓ ఓటరు,పరిస్థితుల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోకుండా వెనుదిరిగిన సంఘటన స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాన్ని ప్రభుత్వ ఇండియన్ మిషన్ పాఠశాలలో ఏర్పాటు చేశారు.అక్కడికి ఓటు వేయడానికి...