పెద్దపల్లి బాలసదన్ హాస్టల్‌లో చిన్నారులకు అస్వస్థత – 32 మంది ఆసుపత్రిలో చేరిక
🔹వెంటనే స్పందించిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 12: పెద్దపల్లిలోని బాలసదన్ బాలల గృహంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఆరోగ్య ఘటన కొద్దిసేపు ఆందోళనకు గురిచేసింది.వాంతులు,కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న 32 మంది చిన్నారులను రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జిల్లా సంక్షేమ అధికారుల సమన్వయంతో ఈ తరలింపు వేగంగా జరిగిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ముందస్తు సమాచారం అందడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై అత్యవసర విభాగాన్ని సిద్ధం చేశారు.డాక్టర్ల బృందం,స్టాఫ్...