ఆపదలో ఉన్న మహిళకు అండగా ఛత్రపతి శివాజీ యువసేన – ముగ్గురు యువకుల రక్తదానం

జనోదయ,కమాన్‌పూర్ మార్చి 13: ఆపదలో ఉన్నవారికి వెంటనే సహాయం చేయాలనే మానవత్వాన్ని చాటుతూ ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులు మరోసారి సేవా భావాన్ని ప్రదర్శించారు. దేవరం పల్లె గ్రామానికి చెందిన నేరెళ్ల రాజేశ్వరి మెదడు ట్యూమర్ శస్త్రచికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అత్యవసరంగా రక్తం అవసరమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులు ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేసి బాధితురాలికి అండగా నిలిచారు. ఒకేసారి ముగ్గురు యువకులు కలిసి రక్తదానం చేయడం విశేషంగా...