కమాన్‌పూర్‌లో శివాజీ విగ్రహం కోరుతూ యువసేన వినతి

జనోదయ,కమాన్‌పూర్‌ ఫిబ్రవరి 10: కమాన్‌పూర్ మండల కేంద్రంలో సమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన వీరయోధుడు,హిందూ ధర్మ రక్షకుడు,హిందూ సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. భావితరాలకు శివాజీ మహారాజ్ జీవిత స్ఫూర్తి,ధైర్యం,పరిపాలనా దూరదృష్టిని చేరవేయడమే ఈ ప్రయత్నం ప్రధాన ఉద్దేశమని యువసేన నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు కమాన్‌పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్,పంచాయతీ కార్యదర్శి,ఎంపీడీవోలకు వినతిపత్రం సమర్పించారు.ప్రజా స్థలంలో విగ్రహ స్థాపన జరిగితే యువతలో దేశభక్తి,క్రమశిక్షణ మరింత పెరుగుతుందని వారు...