janodaya.in
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 1:40 pm Digital Edition : VAMSHI PADALA

కమాన్‌పూర్‌లో శివాజీ విగ్రహం కోరుతూ యువసేన వినతి

జనోదయ,కమాన్‌పూర్‌ ఫిబ్రవరి 10:

కమాన్‌పూర్ మండల కేంద్రంలో సమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన వీరయోధుడు,హిందూ ధర్మ రక్షకుడు,హిందూ సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

భావితరాలకు శివాజీ మహారాజ్ జీవిత స్ఫూర్తి,ధైర్యం,పరిపాలనా దూరదృష్టిని చేరవేయడమే ఈ ప్రయత్నం ప్రధాన ఉద్దేశమని యువసేన నాయకులు పేర్కొన్నారు.

ఈ మేరకు కమాన్‌పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్,పంచాయతీ కార్యదర్శి,ఎంపీడీవోలకు వినతిపత్రం సమర్పించారు.ప్రజా స్థలంలో విగ్రహ స్థాపన జరిగితే యువతలో దేశభక్తి,క్రమశిక్షణ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యువసేన వ్యవస్థాపకుడు జంగపల్లి శ్రీనివాస్,అధ్యక్షుడు మల్యాల శేఖర్ గౌడ్,యువసేన నాయకులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు ద్వారా కమాన్‌పూర్‌కు చారిత్రక గుర్తింపు లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.