ఆపదలో అండగా నిలిచిన చత్రపతి శివాజీ యువసేన – ముగ్గురు యువకుల రక్తదానం

కమాన్‌పూర్,మార్చి 25: కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ఓల్డ్ అంబేద్కర్ నగర్‌కు చెందిన చిప్పకుర్తి రాజశేఖర్ తీవ్ర అనారోగ్యంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. గాళ్‌బ్లాడర్ సమస్యతో పాటు కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనకు అత్యవసరంగా రక్తం అవసరమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఛత్రపతి శివాజీ యువసేనను సంప్రదించగా, సంస్థ వెంటనే స్పందించి సహాయం అందించింది. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకేసారి ముగ్గురు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషంగా నిలిచింది. ముస్కెహరి కృప, ఎలువక గణేష్, మాటేటి చింటూ...