సెంటనరీ కాలనీలో దారుణ హత్య – పెళ్లి వేడుకలో కలకలం
జనోదయ,రామగిరి ఫిబ్రవరి 21: శనివారం మధ్యాహ్నం సెంటనరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో జరిగిన పెళ్లి వేడుక విషాదంగా మారింది. వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)పై గుర్తుతెలియని వ్యక్తులు కమ్యూనిటీ హాల్ గేటు ముందు దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పాత కక్షలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.