చొప్పదండి రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం.. నీళ్లు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సుంకె రవిశంకర్ డిమాండ్

గంగాధర, జూలై 28: చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకునేందుకు వెంటనే వరదకాల్వ, నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాధర ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి నిర్వహించిన "రైతాంగం కోసం రవిశంకర్" నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం పేరుతో పాదయాత్రలు, హామీలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంపులను...