janodaya.in
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 5:00 pm Digital Edition : JANODAYA MEDIA

43వ డివిజన్‌లో బీఆర్ఎస్ ప్రచారానికి జోరు : భారీ ర్యాలీతో ఊపందుకున్న ప్రచారం

🔹ఇంటింటి ప్రచారంతో ప్రజలకు చేరువైన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వల నారాయణ

🔹కారు గుర్తుకే మద్దతు – ఏకస్వరంగా వ్యక్తమైన ప్రజల అభిప్రాయం

జనోదయ,రామగుండం ఫిబ్రవరి 8:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్‌లో బీఆర్ఎస్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్పొరేటర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బీ-ఫామ్ అందుకున్న అభ్యర్థి కల్వల నారాయణ ఇంటింటి ప్రచారంలో భాగంగా శుక్రవారం సుమారు 600 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డివిజన్ అంతటా రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్, 43వ డివిజన్ అధ్యక్షుడు కార్తీక్, సీనియర్ నాయకుడు పెంట రాజేష్, మహిళా విభాగం ఇన్‌చార్జ్ రోజా తదితరులు హాజరై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

ప్రచార సందర్భంగా అభ్యర్థిపై కొందరు చేసిన కాలుష్య ఆరోపణలపై ఆయన స్పష్టత ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాట్లు తనకు ముందే జరిగినవని, అవి ప్రభుత్వ రంగానికి సంబంధించినవని వివరించారు. అయితే సమస్య ఉందంటే దానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని చెబుతూ, కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని హామీ ఇచ్చారు. డ్రోన్ సాంకేతికత ద్వారా దుమ్ము నివారణకు నీటి స్ప్రేయింగ్, ఉదయం–సాయంత్రం రోడ్లపై క్రమం తప్పకుండా నీరు పిచికారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు.

ప్రజల సమస్యలను నేరుగా వింటూ, పరిష్కార మార్గాలను వివరించిన ఈ ప్రచారం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. “ఒక్కసారి అవకాశం ఇవ్వండి… గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం” అని అభ్యర్థి స్పష్టం చేశారు. 43వ డివిజన్ ప్రజలు ఏకగ్రీవంగా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పడం ఈ ప్రచారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మొత్తంగా 43వ డివిజన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయిందని, రానున్న ఎన్నికల్లో గట్టి పోటీకి ఇది నాంది పలికిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.