తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా గాయత్రి కళాశాలలో బోనాలు–గోరింటాకు సంబరాలు
జనోదయ, పెద్దపల్లి జూలై 31: పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగతో పాటు గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో సాంప్రదాయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థినులు, అధ్యాపకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లెంకి రజిని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకుని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బోనాలు తెలంగాణ ప్రాంతానికి...