పాలకుర్తి రైతు వేదికలో శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమం
జనోదయ,పెద్దపల్లి మార్చి 13: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి రైతు వేదికలో శుక్రవారం రైతులకు నూతన వ్యవసాయ సాంకేతికాలపై అవగాహన కల్పించే సదస్సు నిర్వహించారు.వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తల బృందం పాల్గొని రైతులకు పంటల నిర్వహణపై సమగ్ర మార్గనిర్దేశం చేసింది. సదస్సులో విత్తనాల ఎంపిక,ఎరువుల సమర్థ వినియోగం,నీటి నిర్వహణ పద్ధతులు,పంటల బీమా,మార్కెటింగ్ సదుపాయాలు వంటి కీలక అంశాలపై రైతులకు వివరించారు.అదేవిధంగా పెస్టిసైడ్ టాలిరెంట్ హెచ్.టి పత్తి సాగు వల్ల కలిగే దుష్ప్రభావాలు,భూసార...