janodaya.in
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 8:33 am Digital Edition : JANODAYA MEDIA

*కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం*

 

కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఖాయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

-ఎస్సీ సెల్ నేతలతో భేటీ – సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపు

జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 27

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన గౌరవం ఇస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం హాసన్ పర్తిలో వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు, వరంగల్ ఎస్సీ సెల్ చైర్మెన్ చిలువేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ..
“కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలి” అని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో కొత్తగా పదవులు పొందిన నాయకులకు ఆర్డర్ కాపీలు అందజేసి, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.