janodaya.in
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 3:57 pm Digital Edition : JANODAYA MEDIA

విలేకరిని అవమానించిన వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి

గంగాధర, సెప్టెంబర్ 30 (జనోదయ):

గంగాధర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డా. సామ్య విలేకరి జారతి రాజమౌళిపై దురుసుగా ప్రవర్తించడాన్ని కరీంనగర్ జిల్లా జర్నలిస్టుల దాడుల కమిటీ అధ్యక్షుడు శ్రీరాం రవీందర్, గంగాధర మండల జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు జారతి రాజారెడ్డి తీవ్రంగా ఖండించారు.

బుధవారం గంగాధరలో వారి ఆధ్వర్యంలో జర్నలిస్టులు సమావేశమై మంగళవారం జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే విలేకరుల పట్ల ప్రభుత్వ అధికారులు గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. విలేకరి పట్ల డా. సామ్య దురుసుగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.

ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.