janodaya.in
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 9:08 am Digital Edition : VAMSHI PADALA

🚩 ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు 🚩

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 19:

కమాన్‌పూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో గురువారం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. మహానేత చత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు మల్యాల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ హాజరై మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

అయితే ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పారిశుద్ధ్య కార్మికుల సత్కారం. సమాజ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులను యువసేన ఘనంగా సన్మానించింది. వారి సేవలకు కృతజ్ఞతగా తాజా కూరగాయలను అందజేసి అభినందనలు తెలిపింది. శివాజీ మహారాజ్ చూపిన సమానత్వ భావనను ఆచరణలో పెట్టిన ఈ చర్యకు హాజరైన వారందరూ ప్రశంసలు కురిపించారు.

ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ యువసేన వ్యవస్థాపకులు జంగపల్లి శ్రీనివాస్,వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, యువసేన సభ్యులు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా భావం, సామాజిక బాధ్యత కలిసిన ఈ జయంతి వేడుకలు చెయ్యడం జరిగింది.