జనోదయ గంగాధర ఫిబ్రవరి 13:
గంగాధర ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన లారీ, థార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో థార్ కారు వెనుక డోర్ పూర్తిగా దెబ్బతిన్నది. కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తల గాయం కావడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు పక్షాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

