స్రవంతి చేయూతతో డయాలసిస్‌ రోగులకు ఆర్థిక సాయం

జనోదయ,కమాన్‌పూర్‌ సెప్టెంబర్‌ 4:  గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ‘స్రవంతి చేయూత’ ఆధ్వర్యంలో ముగ్గురు డయాలసిస్‌ రోగులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున గంధం కృష్ణ ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో దాతలు గంధం కృష్ణ రూ.1,000, రమేష్‌ రూ.500 విరాళంగా అందించారు. హకీం భాయ్‌, నరేష్‌, మల్లేశ్ సాయం పొందారు.