janodaya.in
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 2:37 pm Digital Edition : JANODAYA MEDIA

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

జనోదయ గంగాధర ఫిబ్రవరి 15:

 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయంలో నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయంలో నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సందర్భంగా ఆలయ పురోహితులు, నిర్వాహకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించి, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివుని ఆశీర్వాదంతో చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, సర్పంచులు రెండ్ల శ్రీనివాస్, కాడరి హారిక కనుకయ్య, వేముల భాస్కర్,పడాల భాగ్యలక్ష్మి రాజన్న ,రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు,తూం రాజు, వేముల అంజి,చందు ,మేర్జ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.