వినియోగదారుల హక్కులను పరిరక్షించాలి
జనోదయ, హనుమకొండ, మార్చి 15: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి వినియోగదారుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఎంతగానో ఉందని వరంగల్ జిల్లా కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మనం కొనే ప్రతి వస్తువుపై మనకు పూర్తి అవగాహన ఉండాలని వస్తువు నాణ్యతను బట్టి ఒక ఎమ్మార్పీ రేటు నిర్ణయించడం జరుగుతుందని ఎవరైనా...