janodaya.in
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 8:23 pm Digital Edition : JANODAYA MEDIA

వినియోగదారుల హక్కులను పరిరక్షించాలి

 

జనోదయ, హనుమకొండ, మార్చి 15:

 

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి వినియోగదారుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఎంతగానో ఉందని వరంగల్ జిల్లా కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మనం కొనే ప్రతి వస్తువుపై మనకు పూర్తి అవగాహన ఉండాలని వస్తువు నాణ్యతను బట్టి ఒక ఎమ్మార్పీ రేటు నిర్ణయించడం జరుగుతుందని ఎవరైనా ఎమ్మార్పీకన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే అవస్తువు బిల్లును మనం అట్టి షాపు యజమాని నుంచి పొందాల్సిందిగా గుర్తు చేశారు. ప్రతి వస్తువుపై మనం పన్నును చెల్లిస్తున్నామని, కనుక వస్తువు నాణ్యత గురించి అడిగే హక్కు ప్రతి వినియోగదారునికి ఉంటుందని గుర్తు చేశారు. మీరు కొనే ఏ వస్తువు కైనా నాణ్యత లోపం అనేది గమనిస్తే వెంటనే వినియోగదారుల హక్కుల ఫోరాన్ని ఆశ్రయించాలని వెంటనే సదర్ యజమాని పై వినియోగదారుల ఫోరం నుండి కేసు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి వినియోగదారునికి ప్రశ్నించే హక్కు తప్పకుండా ఉంటుందని ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల హక్కుల గురించి ప్రచారం చేయాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని వారిలో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని వినియోగదారుల హక్కులను కాపాడాలనిశశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.