వాస్తవానికి 5 ఏండ్లు…..
వాస్తవం.. వాస్తవమే!!!!! మిత్రులారా... వాస్తవం పత్రిక ఐదేండ్లుగా నిరాటంకంగా వెలువడుతూ అశేష పాఠకాదరణ పొందింది.ఈ ఐదేండ్ల కాలంలో అనేక రాజకీయ,సామాజిక విషయాలను ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా,ధైర్యంగా,నిజాయితీగా,నిష్పక్షపాతంగా అక్షరీకరించాం.వాస్తవంలో ప్రచురితమైన అనేక కథనాలు సామాన్య పాఠకుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు చేరడం గొప్ప విజయమే.ఎందరో రాజకీయ ప్రముఖులతోపాటు మేధావులు,కళాకారులు,సామాజిక కార్యకర్తలు,సాహితీవేత్తలు,అధికారులు వాస్తవం పత్రికకు అభిమానులుగా ఉండటం గర్వకారణం.విలువలతో కూడిన పాత్రికేయాన్ని కొనసాగించడానికి అనేక అడ్డంకులు,అవరోధాలు ఎదురైనా ఎక్కడా రాజీలేకుండా నిఖార్సయిన పాత్రికేయాన్ని నిలబెట్టడంలో ఎందరో మహానుభావుల అండదండలు,ఆశీస్సులు ఉండటం అదృష్టంగా...