janodaya.in
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 1:05 pm Digital Edition : JANODAYA MEDIA

వాస్తవానికి 5 ఏండ్లు…..

వాస్తవం.. వాస్తవమే!!!!!

మిత్రులారా… వాస్తవం పత్రిక ఐదేండ్లుగా నిరాటంకంగా వెలువడుతూ అశేష పాఠకాదరణ పొందింది.ఈ ఐదేండ్ల కాలంలో అనేక రాజకీయ,సామాజిక విషయాలను ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా,ధైర్యంగా,నిజాయితీగా,నిష్పక్షపాతంగా అక్షరీకరించాం.వాస్తవంలో ప్రచురితమైన అనేక కథనాలు సామాన్య పాఠకుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు చేరడం గొప్ప విజయమే.ఎందరో రాజకీయ ప్రముఖులతోపాటు మేధావులు,కళాకారులు,సామాజిక కార్యకర్తలు,సాహితీవేత్తలు,అధికారులు వాస్తవం పత్రికకు అభిమానులుగా ఉండటం గర్వకారణం.విలువలతో కూడిన పాత్రికేయాన్ని కొనసాగించడానికి అనేక అడ్డంకులు,అవరోధాలు ఎదురైనా ఎక్కడా రాజీలేకుండా నిఖార్సయిన పాత్రికేయాన్ని నిలబెట్టడంలో ఎందరో మహానుభావుల అండదండలు,ఆశీస్సులు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం.కాలం కరిగినా..తరాలు మారినా..అభిప్రాయాలు మారినా..ఎప్పటికీ వాస్తవం వాస్తవమే.అదే నిజాయితీ..అదే ఒరవడి.వాస్తవానికి రంగులు,హంగులు అక్కర్లేదని,చిత్తుకాగితం మీద రాసినా నిజం నిజేమనని అనేక మార్లు నిరూపించాం. ఈ క్రమంలో నేటితో వాస్తవానికి అక్షర రూపందాల్చి ఐదేండ్లు విజయవంతంగా పూర్తయి…ఆరో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా మిత్రులు,శ్రేయోభిలాషులు,వాస్తవం కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా అభినందనలు,ధన్యవాదాలు తెలుపుకుంటూ….ఈ యేడు మరింత ఆకర్శణీయంగా,మరిన్ని పదునైన కే.ఆర్ ఉన్నమాటలతో మీ ముందుకు రాబోతున్నాం.ఎప్పటిలాగే..మీ ఆదరణ,అభిమానం చెక్కుచెదరరాదని కోరుకుంటూ…

మీ..మానసాని కృష్ణా రెడ్డి
ప్రధాన సంపాదకులు
9618616110