వర్ధంతి సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి 20 కుర్చీల విరాళం
జనోదయ, గంగాధర, జూన్ 2: బూరుగుపల్లి గ్రామ తొలి మహిళా సర్పంచ్‌గా సేవలందించిన కీ.శే. శ్రీమతి మాచర్ల గంగాదేవి 8వ వర్ధంతి సందర్భంగా ఆమె సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ అంగన్వాడీ కేంద్రానికి 20 కుర్చీలను విరాళంగా అందజేశారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు కూర్చోవడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆమె కుమారుడు మాచర్ల శరత్ కుమార్, తన తల్లి జ్ఞాపకార్థం ఈ కుర్చీలను అందించారు. గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బందికి...