janodaya.in
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 9:24 pm Digital Edition : JANODAYA MEDIA

వరంగల్‌లో ఈశా ఇన్నర్ ఇంజినీరింగ్ యోగా

-ఈనెల 12 నుండి 19 వరకు ఐఎంఏ హాల్‌లో.. 12న పరిచయ కార్యక్రమం, 13 నుండి 7 రోజుల ప్రోగ్రాం

జనోదయ: వరంగల్ ప్రతినిధి:

ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 12 నుండి 19 వరకు వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్ వరంగల్ కోఆర్డినేటర్లు డాక్టర్ రమాకాంత్, శిరీష ఆదివారం తెలిపారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఐఎంఏ హాల్, MGM హాస్పిటల్ ఎదురుగా జరిగే పరిచయ కార్యక్రమానికి అందరూ హాజరు కావచ్చు.
ఈనెల 13 నుండి 19 వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు జరిగే 7 రోజుల ప్రోగ్రాంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

*‘రిజిస్ట్రేషన్’:* ఆసక్తి గలవారు 8247423505, 7032458118 నంబర్లలో లేదా https://isha.co/iewgl వెబ్‌సైట్‌లో సంప్రదించి నమోదు చేసుకోవాలి.

ప్రాచీన యోగశాస్త్ర సారం అయిన ఇన్నర్ ఇంజినీరింగ్ ఆనందదాయక జీవితానికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.