రెవెన్యూ కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

జనోదయ,కమాన్‌పూర్‌, సెప్టెంబర్‌ 17:  తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కమాన్‌పూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను తహసీల్దార్‌ వాసంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన దినోత్సవ ప్రాధాన్యాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ స్రవంతి, సీనియర్‌ అసిస్టెంట్‌ సతీష్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌, జీపీఓలు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.