janodaya.in
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 3:36 pm Digital Edition : JANODAYA MEDIA

రామగుండంలో రాజకీయ అలజడి

🔹1వ డివిజన్ ఏకగ్రీవంపై స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు

🔹అధికార పక్షం బెదిరింపులకు పాల్పడుతుందంటూ బిజెపి ఆరోపణ

 

జనోదయ,గోదావరిఖని,ఫిబ్రవరి 02:(నారగోని నగేశ్)

 

రామగుండంలో రాజకీయ అలజడి నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ బిజెపి అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహారణ చేయుంచారంటు ఆ పార్టీ నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో సహా డిజిపి, రామగుండం పోలీస్ కమీషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం….ఎన్టీపిసి ఇందిరమ్మ కాలనీకి చెందిన రీమా బిశ్వాస్ పంకజ్ కుమార్ 1వ డివిజన్ లో బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేసింది. అదే డివిజన్ లో కాంగ్రెస్ పక్షాన మడిపెల్లి మల్లేష్ మల్లేష్ సతీమణి కూడ నామినేషన్ దాఖలు చేశారు. అయితే పంకజ్ ఎన్టీపిసి ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నారు. అతడు పనిచేసే కాంట్రాక్ట్ ద్వారా పోలీసులు పంకజ్ ను పిలిపించారు. నామినేషన్ ఉపసంహారణ చేసుకోక పొతే గంజాయి కేసు నమోదు చేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక కాంగ్రెస్ అభ్యర్థిని భర్త మడిపెల్లి మల్లేష్ అనుచరులు కూడా చంపుతామని బెదిరించారని పేర్కొంది. దీంతో గత్యంతరం లేక తాను నామినేషన్ ఉపసంహారణ చేసుకున్నామని తెలిపారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ ఏ నిర్ణయం తీదుకుంటుందో చూడాలి.

 

తమను కిడ్నాప్ చేసి బలవంతంగా పోలీసుల ద్వారా బెదిరించి నామినేషన్ విత్డ్రాల్ చేయించిన దారుణాన్ని అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీకి ఒకటో డివిజన్ అభ్యర్థి బాధితురాలు రీమా బిశ్వాస్ కంప్లైంట్ చేయడం జరిగింది.అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కు కంప్లైంట్ చేయడం జరిగింది.