జనోదయ,ములుగు, మే.16:
ములుగు జిల్లా ఆసుపత్రి లో కానరాని సిబ్బంది. ఒక రెసర్ట్ లో ఉద్యోగులు విందు (ఒగ్లపూర్ ) ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉద్యోగులు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆస్పత్రిలో ఎవరు లేకుండా జనరల్ ల్యాబ్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆఫీస్ సిబ్బంది అంతా కలిసి గూడపాడు లోనే ఒక రిసార్ట్లో మొన్న ఇటీవలనే వచ్చిన ఉద్యోగంలో చే రిన ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చిన విందుకు హాజరైన తెలియ వచ్చింది . విందులు ఉన్నప్పటికీ కూడా రోగులను వదిలిపెట్టి డాక్టర్లు టెక్నీషియన్లు అందరూ హాస్పటల్లో విధులను వదిలిపెట్టి వారి విలాసాల కోసం ఒగ్లపూర్ లో గల ఒక రిసార్ట్లో ఉన్నారని సమాచారం అందిన వెంటనే జిల్లా ఆసుపత్రికి వెళ్లి చూడగా బ్లడ్ బ్యాంకు మూసి వేసినారు ఆఫీస్ ముసివేసినారు మినిస్ట్రీ రియల్ స్టాఫ్ లు ఎవరూ లేరు ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు కూడా లేరు.జిల్లా మంత్రివర్యులు లోకల్ లో అందుబాటులో ఉన్నా కూడా హాస్పటల్లో వదిలి వివిధ విభాగాల వారు వెళ్లి విందులు చేసుకోవడం ఏంటని పలువురు అనుకుంటున్నారు మొదట హరిత రెస్టారెంట్ సమీపంలో కళ ఒక హోటల్లో వారికి కావలసిన వంట వంట సామాగ్రియుని తయారు చేసుకుని ఇక్కడి నుండి గుడపడుకు తీసుకువెళ్లినట్లు సమాచారం ఏది ఏమైనాప్పటికీ మధ్యాహ్నం విధులలో లేకుండా వైద్య ఉద్యోగులు వెళ్లడం ఏంటని అందరు ప్రశ్నించుకుంటున్నారు ఇట్టి విషయం గూర్చి ఆరా తీయగా ఇటీవల కొత్తగా ఎన్నికైన 16 మంది ల్యాబ్ టెక్నీషియన్లు. డాక్టర్లకు మరియు ఆఫీస్ సిబ్బందికి విందు ఏర్పాటు చేశారని జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉంటే ఎవరన్నా చూస్తారని భయంతో గుడపాడులో గల రిసార్ట్ లోకి మార్చారని తెలియ వచ్చింది. ఇ క్కడ ఉన్నా రోగులు కు ఏమైనా అవసరం పడితే ల్యాబ్ టెక్నీషియన్లు లేనందున వారు ల్యాబ్ ల చుట్టూ తిరగడం అగుపించింది మరియు రేడియాలోజీ హబ్ లో టెక్నీషియన్లు కనురాక వీరు ఎక్కడికెళ్లారని సమాచారం తెలుసుకుని కొందరి పత్రికా మిత్రులకు తెలియజేయడమైనది. క్రింద డ్యూటీ లో ఉన్న స్టూడెంట్ సిబ్బందిని అడగగా వారు పైన మీటింగ్ లో ఉన్నారని చెప్పినారు మీటింగ్ పైకి వెళ్లడం జరిగింది అక్కడ ఎవరూ లేనందున అసలు విషయం తెలియ వచ్చింది. ఏది ఏమైనా కూడా ఒక బాధ్యతగల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటూ ఇలాంటివి చేయడం ఎంతవరకు సమంజసమని వారు అంటున్నారు ఆపద సమయంలో వచ్చే రోగులకు వైద్య పరీక్షలు ఎలా ఎలా చేస్తారుఅని ప్రశ్నిస్తున్నారు సదరు ఉద్యోగులను వీధుల్లో పెట్టి వారి వారి కార్యక్రమాలు వారి డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చేసుకోవాలిగాని సమాజానికి రోగులకు మేలు చేసే వైద్య ఉద్యోగులే ఇలా చేస్తే ఎలా అని వారు చర్చించుకుంటున్నారు మధ్యాహ్న సమయంలో వెళ్లి చూడగా అన్ని గదులకు తాళాలు వేసి స్టూడెంట్ లను మాత్రమే వారి వారి విభాగాలలో పెట్టి అర్హులైన వారందరూ విందు కోసం రిసార్ట్ కు వెళ్లాలని తెలియ వచ్చింది ఇట్టి విషయంపై సదరు అధికారులు వివరాలు తెలుసుకొని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
