janodaya.in
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 9:33 am Digital Edition : JANODAYA MEDIA

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో లైన్‌మెన్ ఓదెలుకు ఘన సత్కారం

జనోదయ,కమాన్‌పూర్ ఆగస్టు 20:

కమాన్‌పూర్ మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న కలవేణి ఓదెలును ముదిరాజ్ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పిల్లి చంద్రశేఖర్ గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యుత్‌ శాఖలో విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ఓదెలు ‘ఉత్తమ లైన్‌మెన్‌’గా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను అభినందిస్తూ ఆత్మీయ సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో అనవేన లక్ష్మీరాజం, పిట్టల తిరుపతి, డాక్టర్‌ శ్రీనివాస్, కొంతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.