మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

జనోదయ, ఏప్రిల్ 08 – గంగాధర: తెలంగాణ రాష్ట్రంలో మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను అందజేస్తోందని పేర్కొన్నారు. బుధవారం గంగాధర మండలం మధురానగర్‌లోని ప్రజా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నియోజకవర్గంలోని 140 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది హాజరు, గర్భిణులు, బాలింతలు,...