మధురానగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  గంగాధర, మార్చి 27 (జనోదయ): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లోని శ్రీ రామ చంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ రామ నవమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు జయజయ నాదాలు చేస్తూ పాల్గొన్నారు....