janodaya.in
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 4:34 pm Digital Edition : JANODAYA MEDIA

భారీ వర్షాల నేపథ్యంలో జూలై 31న జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు

కరీంనగర్ | జనోదయ | జూలై 30

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూలై 31, 2026 (శుక్రవారం) కరీంనగర్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) తెలిపారు. ఈ సెలవుకు బదులుగా ఆగస్టు 8, 2026 (రెండో శనివారం)ను పని దినంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శిక్షణా కార్యక్రమాలు (Trainings) యథావిధిగా కొనసాగుతాయని డీఈవో స్పష్టం చేశారు.