బొజ్జ గణపయ్యలను దర్శించుకున్న ఇనగంటి రామారావు

జనోదయ,కమాన్‌పూర్‌, సెప్టెంబర్‌ 17: కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన గణనాథులను గురువారం కాంగ్రెస్‌ నాయకుడు ఇనగంటి రామారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేశవనగర్‌, హనుమాన్‌నగర్‌, గోకుల్‌నగర్‌, సుభాష్‌నగర్‌, రాంనగర్‌, దాసరిపల్లె, ఓల్డ్‌ అంబేద్కర్‌నగర్‌, న్యూ అంబేద్కర్‌నగర్‌, శ్రీనగర్‌, కమాన్‌పూర్‌ ఎక్స్‌రోడ్‌తో పాటు పలు ప్రాంతాల్లోని గణపతి మండపాలను సందర్శించారు. ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడిన రామారావు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను...