జనోదయ,గోదావరిఖని, ఫిబ్రవరి 03:
రామగుండంలోని అంజనాద్రి గుట్టపై ఉన్న శ్రీ ధనుర్ బాణ రామాంజనేయ స్వామి ఆలయంలో, సప్తగిరి కాలనీ లోని శివాలయంలో రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 60 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థుల ‘బి’ ఫారమ్‌లకు మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి స్వామివారి ఆశీస్సులు కోరారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచి రామగుండం నగర అభివృద్ధికి కృషి చేయాలని రాజ్ ఠాకూర్ దంపతులు ఆకాంక్షించారు.