బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్..!
## 30 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత ##వార్డెన్ నిర్లక్ష్యంపై అర్ధరాత్రి వసతి గృహం ఎదుట విద్యార్థినీల ఆందోళన జనోదయ, బెల్లంపల్లి, ఫిబ్రవరి 6: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలో గల బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ వల్ల 30 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి వసతి గృహంలో భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థులంతా కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. విద్యార్థులను తిరుమల, తమన్నా, శాలిని, కోమల, మాధవి, మల్లేశ్వరి, జయశ్రీ, రక్షిత, జోష్ణ లతోపాటు...