ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం “సయ్యద్ ఇంతియాజ్”
-మణికంఠ కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించిన -14వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 16: 14వ డివిజన్ పరిధిలోని మణికంఠ కాలనీ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బుధవారం కాంగ్రెస్ 14వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధి లైట్ల వంటి వివిధ సమస్యలను డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, వాటిని...