janodaya.in
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 12:25 am Digital Edition : VAMSHI PADALA

పోషణ మాసంతో ఆరోగ్యంపై అవగాహన

జనోదయ,కమాన్‌పూర్‌, సెప్టెంబర్‌ 21:

కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గ్రామ సర్పంచ్‌ రంగు సత్యనారాయణ గౌడ్‌, ఉపసర్పంచ్‌ మహమ్మద్‌ రఫిక్‌ సోహెల్‌ పాల్గొన్నారు. ‘సరైన పోషణ–ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించారు.

సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 8 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా గర్భం దాల్చినప్పటి నుంచి చిన్నారులకు రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తీసుకోవాల్సిన పోషకాహారంపై వివరించారు. ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషక పదార్థాలను సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సూర్యకళ, వార్డు సభ్యులు పంజా సాయిరాం, మేరుగు కుమార్‌, గొట్టె సరిత, టీచర్లు భాగ్య, కృష్ణకుమారి, కుక్క కుమారి, నాగసరోజన, మణి, ఆశా వర్కర్‌ కృష్ణవేణి పాల్గొన్నారు.