పైడిమడుగు ప్యాక్స్‌కు జాతీయ పురస్కారం స్పెషల్ ఆఫీసర్ అసద్ ఆనందం వ్యక్తం

  జనోదయ, కోరుట్ల, మార్చి 15: కోరుట్ల మండలం పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) జాతీయ స్థాయిలో తృతీయ బహుమతికి ఎంపిక కావడం పట్ల పైడిమడుగు స్పెషల్ ఆఫీసర్, జిల్లా సహకార కార్యాలయ సూపరింటెండెంట్ అసద్ ఆనందం వ్యక్తం చేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ నుంచి ఉత్తమ సంఘంగా ఈ గుర్తింపు లభించడం గర్వకారణమని తెలిపారు. బ్యాంకింగ్ సేవల కంప్యూటరైజేషన్, సమర్థ నిర్వహణ, సభ్యుల ఆర్థిక ప్రయోజనాల పెంపు, రైతులకు అందిస్తున్న సేవల కారణంగా ఈ...