పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రచారం జోరు
🔹అభివృద్ధే అజెండాగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఎన్నికల ప్రచారం జనోదయ,ఫిబ్రవరి 2:(పడాల వంశీ) పెద్దపల్లి ప్రతినిది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 12, 29, 31వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శాసనసభ్యుడు చింతకుంట విజయరమణ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ముందు సాగర్ రోడ్డులోని కంచేర భావి సమీప హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయా వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ,...